ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..

Published on Mon, 06/05/2023 - 08:29

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్‌ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి.  అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి.  

వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది.

చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు 

ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్‌​ మీడియాలో వైరల్‌గా మారాయి.  రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ  ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్‌ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000  మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్‌, కటక్‌, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)