Breaking News

ఒడిశాలో భారీ వర్షాలు.. 18 గ్రామాలకు సంబంధాలు కట్‌

Published on Sun, 07/28/2024 - 09:03

దేశంలోని పలు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్‌గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ  వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.

మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ బ్లాక్‌ పరిధిలోని బయపదర్‌ ఘాట్‌ రోడ్డులోని తుంబపదర్‌ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్‌గిరి, కోరాపుట్‌లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్‌పూర్, ఝర్సుగూడ, సుందర్‌ఘర్, సంబల్‌పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.

ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్‌గఢ్, జార్సుగూడ, సుందర్‌ఘర్, నుపాడా, నబరంగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)