Breaking News

ప్రేమ వివాహం చేసుకున్నారని..

Published on Fri, 07/11/2025 - 17:03

ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నడం పేరిట చితకబాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట పట్ల ఊరి పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా ఆ జంటను కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నించారు.  రాయగడ జిల్లాలోని కంజమజ్హిరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

గ్రామానికి చెందిన యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు.  పెద్దలను ఒప్పించి ఇటీవలె వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి ఊరి పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరూ వరుసకు బంధువులే అయినప్పటికీ.. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ ఈ శిక్షను విధించారు. 

తొలుత వీళ్లతో పొలం దున్నడం పేరిట హింసించిన కొందరు.. ఆపై గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)