Breaking News

‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!

Published on Wed, 04/10/2024 - 07:04

ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్‌ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్‌ బాసాన్‌ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్‌ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్‌ నోబెల్‌ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్‌ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు.

హిగ్స్‌ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత,  ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. 

హిగ్స్‌ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి?

సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్‌ హిగ్స్‌ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్‌ ఫీల్డ్‌)లో కదులుతూ ఈ బోసాన్‌ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్‌తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా.

ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్వి‍ట్జర్లాండ్‌ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి  చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్‌ బాసాన్‌ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్‌ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్‌ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)