Breaking News

10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్‌..!

Published on Sun, 06/22/2025 - 06:37

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో నిబంధనను అమల్లోకి తేనున్నాయి. పదేళ్లు దాటిన వాహనాలకు బంక్‌ల్లో డీజిల్, పెట్రోల్‌ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్‌తో నడిచే వాహనాలకు జూలై ఒకతో తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ పోయవద్దంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 

ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగి్నషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాల నెట్‌వర్క్‌ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటయ్యాయి. వాహన డేటాబేస్‌తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు, పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లోకి వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజి్రస్టేషన్‌ నంబర్‌ సాయంతో ఇతర వివరాలను తక్షణమే క్రాస్‌ చెక్‌ చేస్తాయి. 

వాహనం ఈఎల్‌వీ(ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ వెహికల్‌)గా గుర్తించినా లేదా చెల్లుబాటయ్యే పొల్యూషన్‌ సరి్టఫికెట్‌ లేకున్నా సిస్టమ్‌ ఆపరేటర్‌కు ఆడియో హెచ్చరికను జారీ చేస్తాయి. అక్టోబర్‌ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్‌ బుద్ధనగర్, సోనిపట్‌ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌సీఆర్‌ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అమలులోకి రానుంది. ఢిల్లీలో 10–15 ఏళ్లు దాటిన వాహనాలు 62 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)