Breaking News

Bihar: కోటి ఉద్యోగాలు.. పరిశ్రమలకు ఉచిత భూములు.. నితీష్‌ ఎన్నికల హామీలివే..

Published on Sat, 08/16/2025 - 11:22

పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో సీఎం నితీష్‌ కుమార్‌ పలు ఎన్నికల హామీలను గుప్పించారు. తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. 2020లో ‘సాత్ నిశ్చయ్-2’ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి మార్గాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని సిఎం వివరించారు.

సీఎం నితీష్‌ కుమార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేశారు. తమ ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని, బీహార్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యవస్థాపకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బీహార్‌లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సీఎం నితీష్ కుమార్ చేసిన ప్రధాన హామీలివే..
 

ప్రోత్సాహకాలు రెట్టింపు 
మూలధన సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, జీఎస్‌టీ రీయంబర్స్‌మెంట్ కోసం అందించిన మొత్తాన్ని రెట్టింపు చేయడం.

పరిశ్రమలకు భూమి 
పరిశ్రమల స్థాపన కోసం ప్రతి జిల్లాలో భూమిని  కేటాయించనున్నారు.

ఉపాధికి ఉచిత భూమి 
అధికంగా ఉపాధిని కల్పించే పరిశ్రమలకు ఉచితంగా భూమి ఇవ్వనున్నారు.

భూ వివాదాల పరిష్కారం 
పరిశ్రమల కోసం కేటాయించిన భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు వెంటనే పరిష్కరించనున్నారు.

కాలపరిమితి ప్రయోజనాలు 
ఈ ప్రయోజనాలు రాబోయే ఆరు నెలల్లో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు  అందనున్నాయి. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు