Breaking News

రికార్డు సృష్టించనున్న నితీష్ కుమార్..10సారి ముఖ్యమంత్రిగా?

Published on Fri, 11/14/2025 - 13:06

ఈ రోజుల్లో రాజకీయాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కష్టపడడంతోపాటు అదృష్టం సైతం కలిసిరావాలి. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడానికే నేతలు ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. అలాంటిది ఒక ప్రభుత్వ అధినేతగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేయడమంటే ఎంత కష్టమైన వ్యవహారమో ఆలోచించండి. బిహార్ ఎ‍న్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గెలిస్తే నితిష్ కుమార్ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది ఇదే జరిగితే ఏకంగా పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ రికార్డు సృష్టించనున్నారు. 
 

నితీష్ కుమార్ ఈ పేరు వింటే చాలు రాజకీయ ఎత్తుగడలకు, సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తన పదవి కాపాడుకోవడం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా నితీష్ సై అంటారు. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పొత్తుతో అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టిన నితీష్ కుమార్ కొద్దికాలానికే  ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమిని వీడి తిరిగి ఎన్డీఏతో జతకట్టారు. 2022లో ఎన్డీఏకు కటీఫ్ చెప్పిన నితిష్ తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కొద్ది కాలం మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయన  ఆ కూటమిలో పొసగక తిరిగి కాషాయ దళంతో దోస్తీ చేశారు. తాజాగా ఎన్డీఏతో మరోసారి జతకట్టి బిహార్ లో  మరోసారి అధికారం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.

2000 సంవత్సరంలో తొలిసారి ముఖమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వ అస్థిరతతో 7 రోజులకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2005లో తిరిగి సీఎంగా పదవి చేపట్టిన ఆయన 2014లో ఎన్డీఏ కూటమితో విభేదాల కారణంగా పదవి కోల్పోయారు. ఆకాలం మినహా 2005 నుంచి నేటి వరకూ ఆయనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఒక రాష్ట్ర మఖ్యమంత్రిగా పది సార్లు ప్రమాణం స్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ కుమార్ రికార్డులెక్కుతారు.

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)