Breaking News

నితీష్‌ పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది?

Published on Sat, 02/10/2024 - 10:55

బీహార్‌ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్‌ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్‌సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. 

గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్‌డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్‌డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్‌సింగ్ కుష్వాహ సూచించారు.

బీహార్‌ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు  ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)