Breaking News

మహారాష్ట్ర పాలి‘ట్రిక్స్‌’.. గడ్కరీ అదిరిపోయే సెటైరికల్‌ పంచ్‌

Published on Fri, 07/07/2023 - 19:26

నాగపూర్‌: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు శివసేన గుర్తుపై పొలిటికల్‌ ట్విస్టులు చోటుచేసుకోగా, తాజాగా ఎన్సీపీలో రాజకీయం వేడెక్కింది. అజిత్‌ పవార్‌ తిరుగుబాటుతో శరద్‌ పవార్‌కు షాక్‌ తగిలింది. అజిత్‌ పవార్‌ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 

కాగా, ఆయన వర్గానికి మంత్రి పదవులు కూడా ఇచ్చేందుకు ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం అంగీకరించింది. అయితే శాఖల కేటాయింపుల విషయంలో షిండే వర్గం, బీజేపీ, పవార్‌ వర్గం మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని సమాచారం. మరోవైపు, ప్రభుత్వంలోకి అజిత్‌ పవార్‌ రాకతో.. మంత్రి పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శిందే వర్గం, బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

అయితే, నితిన్‌ గడ్కరీ నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మహా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులకు ఇప్పుడు క్యూ పెరిగింది. మంత్రి పదవి తమదనేని ఆశించిన నేతలకు ఇప్పుడు తాము ‘కుట్టించుకున్న సూట్ల’ను ఏం చేయాలో తెలియడం లేదు అంటూ పొలిటికల్‌ పంచ్‌లు విసిరారు. 

‘ప్రజలు తమకు దక్కిన వాటితో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. నేను ఆశించిన దాని కంటే ఎక్కువ పొందాను అని ఓ వ్యక్తి అంగీకరించగలిగితే అప్పుడే అతను సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు. లేదంటే కార్పొరేటర్లు తమకు ఎమ్మెల్యే పదవి దక్కలేదని, ఎమ్మేల్యేలు తమకు మంత్రి పదవులు రాలేదని బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు  కొందరి పరిస్థితి అలాగే (మహారాష్ట్ర రాజకీయాలను ఉద్దేశిస్తూ)ఉంది. మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన వారు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులు దక్కించుకునేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో తమ వంతు వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. పైగా మంత్రి పదవి ఆశించిన వారు ఇప్పటికే ప్రమాణ స్వీకారం కోసం సూట్లు కుట్టించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రద్దీ పెరగడంతో ఆ సూట్లను ఏం చేయాలనే ప్రశ్న మొదలైంది’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ పొలిటికల్‌ ప్లాన్‌ ఛేంజ్‌.. మోదీ కీలక నిర్ణయం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)