Breaking News

నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు

Published on Sun, 08/03/2025 - 16:30

నాగపూర్‌: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు కాల్స్‌, మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న నితిన్‌ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి.. పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌.. గడ్కరీ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్‌ నంబర్‌ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తిని నాగ్‌పుర్‌ తులసి బాగ్ రోడ్‌లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించామన్నారు. బెదిరింపు కాల్‌ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)