Breaking News

వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ అందుబాటులోకి

Published on Thu, 06/19/2025 - 05:06

సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక ఫాస్టాగ్‌ ఆఫర్‌ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్యయేతర, ప్రైవేట్‌ వాహనదారుల టోల్‌ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్‌తో ముందుకొచ్చింది. గరిష్టంగా 200 ట్రిప్పులకు అనుమతిస్తూ వార్షిక ఫాస్టాగ్‌ ఆఫర్‌ను తీసుకొస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ప్రకటించారు. కార్లు, జీప్‌లు, వ్యాన్ల వంటి వాణిజ్యయేతర ప్రైవేట్‌ వాహనాలకు మాత్రమే ఈ వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ వర్తిస్తుంది. కావాలనుకున్న వాహనదారులు మాత్రమే వార్షిక పాస్‌ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. వార్షిక పాస్‌ అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఒకవేళ ఈపాస్‌ను వాణిజ్య వాహనాలకు ఉపయోగించాలని చూస్తే ముందస్తు సమాచారం లేకుండానే వాళ్ల పాస్‌ను ప్రభుత్వం రద్దు చేయనుంది. 

ఎప్పటి నుంచి అమల్లోకి?
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్క రించుకుని ఆగస్ట్‌ 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్‌ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. 

ఎలా వసూలు చేస్తారు?
టోల్‌ప్లాజాను దాటిన ప్రతి ఒక్కసారి ఒక ట్రిప్పుగా లెక్కగడతారు. ఉదాహరణకు మనం ప్రయాణంలో నాలుగు టోల్‌ప్లాజాలను దాటితే నాలుగు ట్రిప్పులు పూర్తయినట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ అనేది 200 సార్లు మాత్రమే పనిచేస్తుంది. 200 సార్లు పూర్తికాకపోతే ఏడాదంతా ఈ పాస్‌ పనిచేస్తుంది. ఈ రెండింటితో ఏది ముందుగా ముగిస్తే దానిని ఫాస్టాగ్‌కు తుదిగడువుగా పరిగణిస్తారు. ఉదాహరణకు నవంబర్‌కల్లా 200 ట్రిప్పులు అయిపోతే ఆ ఏడాదికి యాన్వల్‌ పాస్‌ ముగిసినట్లే. మళ్లీ యాన్వల్‌ పాస్‌ కావాలంటే ఆ తర్వాత వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు. 

ఇప్పటికే పాస్‌ ఉంటే మళ్లీ కొనాలా?
ఇప్పటికే సాధారణ ఫాస్టాగ్‌ ఉంటే మళ్లీ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ కొంటే ప్రస్తుతం యాక్టివేషన్‌లో ఉన్న కార్డుకే ఆ ఆఫర్‌ కొనసాగింపుగా ఉంటుంది. విడిగా కొనాల్సిన పనిలేదు.

ఎక్కడెక్కడ పని చేస్తుంది?
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయరహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌ వేలపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద కొత్త పాస్‌ పనిచేస్తుంది. అయితే రాష్ట్ర రహదారులు(ఎస్‌హెచ్‌)లు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల నిర్వహణలో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద మాత్రం అదనంగా వాహనదారులు యూజర్‌ ఫీజు కట్టాల్సి రావొచ్చు.

ఎక్కడ నుంచి కొనొచ్చు?
రాజ్‌మార్గ్‌ యాత్రా యాప్‌లో త్వరలో సంబంధిత ఫాస్టాక్‌ కొనుగోలు లింక్‌ను అందుబాటులోకి తేనున్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్‌) అధికారిక వెబ్‌సైట్లలోనూ ఈ లింక్‌ను పెట్టనున్నారు.

కొత్త పాస్‌ ఖచ్చితంగా తీసుకోవాలా?
ప్రస్తుతమున్న, ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్‌ల వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుంది. వార్షిక పాస్‌ తీసుకోవ డమనేది వాహనదారుల స్వచ్ఛంద నిర్ణయం. 
పాత ఫాస్టాగ్‌లు సైతం కొనసాగుతాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)