Breaking News

‘నర్వ’ నీటి నిల్వలు.. దేశానికే ఆదర్శం

Published on Fri, 11/21/2025 - 02:30

సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర నీటిఎద్దడితో కరువు ప్రాంతంగా పేరున్న నారాయణపేట జిల్లాలో ఇప్పుడు జలసిరులు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు మన తెలంగాణలోని ‘నర్వ’బ్లాక్‌ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ‘వాటర్‌ బడ్జెటింగ్‌ ఇన్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్స్‌’నివేదికలో నర్వ బ్లాక్‌ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించింది. దేశంలోని ఇతర ఆస్పిరేషనల్‌ బ్లాక్‌లు నీటిలోటుతో సతమతమవుతుంటే...నర్వ మాత్రం 33 శాతం మిగులు జలాలతో నీటి భద్రతలో తమకు సాటిలేరని నిరూపించుకుంది. 

తక్కువ వాన.. అయినా నిండు కుండలా  
నర్వ బ్లాక్‌లో సగటున నమోదయ్యేది కేవలం 524 మిల్లీమీటర్ల వర్షపాతమే. సాధారణంగా ఇంత తక్కువ వర్షపాతం ఉంటే.. ఆ ప్రాంతం నీటిఎద్దడిని ఎదుర్కోవాలి. కానీ, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, నీటి నిల్వ సామర్థ్యం అద్భుతాలను సృష్టిస్తున్నాయి. నర్వలో కురిసే వర్షం ద్వారా వచ్చే నీరు తక్కువే అయినా, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టడంలో ఈ బ్లాక్‌ విజయం సాధించింది. నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం.. నర్వలోని చెరువులు, కుంటలు, ఇతర జల వనరుల్లో ఏకంగా 23,371 హెక్టార్‌ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. 

సాగు నీరే సింహభాగం  
నర్వ బ్లాక్‌లో నీటి వినియోగం ప్రధానంగా వ్యవసాయం చుట్టూనే తిరుగుతోంది. బ్లాక్‌లో అందుబాటులో ఉన్న నీటిలో 91 శాతం కేవలం సాగుకే వినియోగిస్తున్నారు. ఇక్కడ గొర్రెల పెంపకం (సుమారు 1.08 లక్షలు) కూడా ఎక్కువే అయినా, వాటి నీటి అవసరాలు తక్కువగానే ఉన్నాయి. మానవ అవసరాలకు 6 శాతం నీటిని వాడుతున్నారు. 

భూగర్భ జలాలపైనే భారం.. మారాల్సిన తీరు  
నీటి నిల్వల్లో నర్వ మిగులు సాధించినా, క్షేత్రస్థాయిలో రైతులు ఇంకా భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. బ్లాక్‌లో 70 శాతం నీటి సరఫరా భూగర్భ జలాల నుంచే జరుగుతోంది. ఉపరితల నీటి వాటా కేవలం 30 శాతమే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ భూగర్భ జలాలు ‘సేఫ్‌’జోన్‌లోనే ఉన్నా, భవిష్యత్‌లో బోరుబావుల వినియోగం తగ్గించి, చెరువు నీటిని సాగుకు మళ్లించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నర్వ విజయ రహస్యాలివే 
నీటి లభ్యత: 2,163 హెక్టార్‌ మీటర్లు. 
నీటి అవసరం: 1,627 హెక్టార్‌ మీటర్లు. 
మిగులు జలాలు: +536 హెక్టార్‌ మీటర్లు  (33% సర్‌ ప్లస్‌)  

సేఫ్‌జోన్‌: భూగర్భ జలాల వినియోగం 40.78 శాతంతో ‘సురక్షిత’వర్గంలో ఉంది. 
మిషన్‌ భగీరథ సక్సెస్‌: ‘జల్‌ జీవన్‌ మిషన్‌’కింద ఈ బ్లాక్‌లో 100 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోంది. 
⇒   నర్వలో ఉపరితల నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున, రైతులు బోరుబావులపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తద్వా రా భూగర్భ జలాలను భవిష్యత్‌ తరాలకు భద్రపరచవచ్చని నీతి ఆయోగ్‌ తమ నివేదికలో సూచించింది.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)