Breaking News

పోలీసుల అదుపులో గోవా నైట్‌క్లబ్‌ యజమాని

Published on Wed, 12/10/2025 - 11:06

గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్‌ఫోల్  బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా తాజాగా ఆ క్లబ్‌లో సహా యజమానిగా ఉన్న   అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ శనివారం గోవాలోని బిర్చ్ బై  రోమియో నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది సజీవదహనమయ్యారు.  ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఆ యజమానులకు చెందిన మరో క్లబ్‌ను  కూల్చివేయాలని నిన్న అధికారులను ఆదేశించారు. దీంతో ‍అధికారులు నిన్న మరో క్లబ్‌ను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో ‍అగ్నిప్రమాదం జరిగిన క్లబ్‌కు కో పార్టనర్‌గా ఉన్న అజయ్‌ గుప్తా ‍అనే వ్యక్తిని పోలీసులు ‍అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తాను క్లబ్‌ పార్టనర్‌ మాత్రమేనని అంతకు మించి తనకు ఏమి తెలియదని గుప్తా తెలిపినట్లు సమాాచారం. అజయ్‌ గుప్తాను విచారణ నిమిత్రం పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

‍కాగా ప్రమాద ఘటన జరిగిన కొద్దిసేపటికే క్లబ్‌ యజమానులు సౌరవ్‌ లూథ్రా, గౌరవ్‌ లూథ్రాలిద్దరూ థాయ్‌లాండ్ పారిపోయారు. దీంతో వారిద్దరిపై పోలీసులు లూకౌట్‌ నోటీలుసు ఇష్యూ చేయగా, ఇంటర్నేషనల్ ఏజేన్సీ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేయడానికి సాధారణంగా వారం రోజుల సమయం పడుతుందని కానీ ఈ ప్రమాద ఘటన తీవ్రత నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు తక్షణమే స్పందించి కేవలం రెండు రోజుల్లో బ్లూకార్నర్‌ నోటీసులు వచ్చేలా కృషి చేశాయని గోవా పోలీసు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్న లూథ్రాబ్రదర్స్‌ను పట్టుకోవడానకి గోవాకు చెందిన ప్రత్యేక పోలీసుల బృందం థాయ్‌లాండ్‌కు వెళ్లాయని పేర్కొన్నారు. గోవా ప్రమాద ఘటనకు కారణమైన వారిని పట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని దానికోసం సీబీఐతోపాటు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లూథ్రా బ్రదర్స్‌కు ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు.  న్యూఢిల్లీలోని రీజినల్‌ పాస్‌ పోర్ట్ ఆఫీస్ లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్ ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది.

ఈ శనివారం అర్థరాత్రి బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవదహనమ‍య్యారు. ఈ ప్రమాదానికి కారణం ఆ క్లబ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని తేలింది. నైట్‌ క్లబ్‌కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేక పోయిందని అధికారులు తెలిపారు. దానితో పాటు క్లబ్ నిర్మాణం తాటాకులతో చేపట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)