Breaking News

ఢిల్లీ పేలుళ్ల కేసు: అమిర్‌ రషీద్‌ అరెస్ట్‌

Published on Sun, 11/16/2025 - 20:31

ఢిల్లీ:  ఢిల్లీ నగరంలోని ఎర్రకోటకు సమీపంలో  ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మరొక వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ఈరోజు(ఆదివారం) అమిర్‌ రషీద్‌ అలీ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న  ఉమర్‌ నబీకి సహచరుడిగా ఉన్న అమిర్‌ రషీద్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రధానంగా ఉమర్‌ నబీ  కారు కొనడంలో అమిర్‌ రషీద్‌ సహకారం అందించాడు. 

రషీద్‌ అలీ పేరుపైనే దాడిలో ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్‌ అయ్యింది. ఆ రోజు కారు నడిపింది ఉమర్‌ నబీ అనే విషయం ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ల ఆధారంగా బయటపడింది.  కారు కొనడానికి అమిర్‌ కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడని, ఈ దాడిలో అమిర్‌ పాత్ర కూడా ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అమిర్‌ రషీద్‌ అరెస్ట్‌తో మరిన్ని విషయాలు తమ దర్యాప్తు ద్వారా రాబట్టవచ్చిన అధికారులు భావిస్తున్నారు.

కాగా, నవంబర్‌ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు.

పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్‌ ఉమర్‌ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్‌ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్‌ ఫైళ్లు, ఓపెన్‌ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్‌ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్‌ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్‌ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్‌ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్‌ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్‌ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్‌ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్‌ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్‌ పార్కింగ్‌ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)