Breaking News

పెళ్లైన నాలుగు నెలలకే హోటల్‌ గదిలో అనంతలోకాలకు : భర్త పనేనా?

Published on Mon, 10/26/2026 - 15:54

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో  పెళ్లైన నాలుగు నెలలకే  ఒక నవ వధువు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన సోమవారం ఉదయం సుమారు 10:50 గంటలకు ఝాన్సీలోని రిషభ్ హోటల్‌లో జరిగింది. 47 సెకన్ల సీసీటీవీ దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరణించిన మహిళను ముస్కాన్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తుండగా, పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.

ఈ సీసీటీవీ క్లిప్‌లో  దృశ్యాల ప్రకారం  28 ఏళ్ల ముస్కాన్‌,  భర్త నిలేష్‌తో సహా ముగ్గురు వ్యక్తులు హోటల్ కారిడార్ గుండా నడుచుకుంటూ గది వైపు వెళ్లడం కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు గదిలోకి వెళ్లగా, వెనుక వస్తున్న ముస్కాన్ గది తలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా కిందపడిపోయింది. దానితో ఆమె భర్త వచ్చి ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది సాయంతో ఆటోలో ఆసుపత్రికి, అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

 ముందై పెళ్లైంది : కుటుంబ సభ్యుల ఆరోపణలు
అయితే దీనిపైముస్కాన్ తండ్రి రామ్‌జీ లాల్ అహిర్వార్ తన కుమార్తెను ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న  తన బిడ్డకు వివాహమైందని, అయితే  నిలేష్‌కి ఇదివరకే పెళ్లయిందనే విషయం తమకు తెలిసిందని తండ్రి చెప్పారు. ఆ మొదటి భార్య ఇండోర్‌లో ఉంటుందని, ఆమెతో పోలుస్తూ తరచూ  ముస్కాన్‌ను మానసికంగా వేధించేవాడని వాపోయారు.   అంతేకాదు అక్టోబర్ 23 రాత్రి ఝాన్సీకి వచ్చిన నిలేష్, మరుసటి రోజు ముస్కాన్‌ను అత్తగారింటికి తీసుకెళ్తున్నానని చెప్పి,  అత్తగారింటికి తీసుకెళ్లకుండా, నీలేష్ ఆమెను 'రిషభ్ హోటల్'కు తీసుకెళ్లాడని అహిర్వార్ ఆరోపించారు. అక్టోబర్ 23 నుండి అక్టోబర్ 24 వరకు హోటల్‌లో గది బుక్ చేసినట్టు తమకు తెలిసిందన్నారు. కాగా ముస్కాన్ పుట్టింటి వారు ఝాన్సీలో ఉండగా, ఆమె అత్తగారి ఇల్లు మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఉంది.

ముస్కాన్ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో, పోలీసులు నీలేష్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. సిప్రి బజార్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్పీ (సిటీ) ప్రీతి సింగ్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బుర్రకథకు పట్టాభిషేకం

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)