Breaking News

స్నానం చేస్తుండగా పేలిన గీజర్..నవ వధువు దుర్మరణం

Published on Sat, 11/30/2024 - 14:20

ఉత్తరప్రదేశ్‌లో గీజర్‌ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు  తన అత్తమామల ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ పేలుడులో ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. బరేలీలోని మీర్‌గంజ్ ప్రాంతంలో  ఈ విషాదం చోటు చేసుకుంది.

బులంద్‌షహర్‌లోని కలే క నగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 22న పిపల్సనా గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత అత్తారింటికి వచ్చింది. ఈ  క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిన  అమ్మాయి ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు పలుమార్లు  పిలిచినా స్పందించలేదు.  దీంతో అనుమానం వచ్చి,   బాత్రూమ్ తలుపు పగులగొట్టి చూశారు.   ఆ సమయంలో ఆమె నేలపై అపస్మారక స్థితిలో పడి  ఉంది.  గీజర్ పేలిపోయింది.

వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)