Breaking News

పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఏడుపు ఒక్కటే తక్కువ!

Published on Sat, 05/28/2022 - 12:53

ఫేస్‌బుక్‌ ప్రేమ ఎంత పనిచేసింది. ఎన్నో ఆశలతో ఆమెతో కొత్త జీవితం ప్రారంభిలానుకున్న వరుడికి పెళ్లైన కాసేపటికే గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. వధువు అంత పనిచేస్తుందని అతను కలలో కూడా అనుకొని ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా 15 రోజులకే ప్రేమగా మారింది. దీంతో మే 24న జాజ్​పుర్​లోని ఛండీఖోల్​లో మేఘనను అలోక్ కలిశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, వీరి గురించి కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించారు. 

అనంతరం వీరిద్దరికీ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. కాగా, అదే రోజు సాయంత్రం వరుడి ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి వరుడికి పెద్ధ షాకిచ్చాడు. పెళ్లికూతురును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వధువు(అతని) పేరు మేఘన కాదు మేఘనాథ్​ అని, అతను తమకు దగ్గరి బంధువే చెప్పాడు.

ఈ విషయం తెలుసుకున్న కుబుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అతడిని చితకబాదుడు. గ్రామస్తులు కూడా ఫేక్‌ వధువును పట్టుకుని కొట్టారు. అనంతరం అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా పెళ్లి పెటాకులు కావడంతో వరుడి హృదయం ముక్కలైంది. 

ఇది కూడా చదవండి:  అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)