Breaking News

అందంగా లేదని చిత్రహింసలు

Published on Mon, 04/21/2025 - 07:07

రాయచూరురూరల్‌(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 

గదగ్‌ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్‌కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్‌ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి  వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి.   

అందంగా లేవని,  వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని  పుట్టింటి వారికి  చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు.  అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి  పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్‌ చేశారు.    


 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)