Breaking News

భార్య కళ్ల ముందే దారుణం.. నవ వరుడు..

Published on Wed, 01/11/2023 - 15:18

బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్య కళ్ల ముందే భర్త మృతి చెందిన ఘటన బేరికె పోలీస్‌స్టేన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... హోసూరు సమీపంలోని వెంకటేశపురం గ్రామానికి చెందిన కార్మికుడు అంజినప్ప (25)కు గతనెల 5న సూళగిరి సమీపంలోని త్యాగరసనపల్లి గ్రామానికి చెందిన వెన్నెల (20)తో వివాహం జరిగింది.

ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో భార్యను తీసుకొని త్యాగరసనపల్లి గ్రామానికి వెళ్తుండగా బేరికె సూళగిరి రోడ్డులోని ఏ.శెట్టిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అంజినప్ప ఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన వెన్నెలను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: (పట్టుబడ్డ దొంగను స్టేషన్‌కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..)

       

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)