Breaking News

ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ ఆవిర్భావం సహజమే

Published on Thu, 06/12/2025 - 06:14

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌లలో కొత్తగా ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ పుట్టడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సార్స్‌–కోవ్‌–2 వేరియంట్‌లో సహజ ఉత్ప్రరివర్తనమని భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ చెప్పారు. భారత్‌లో వెలుగుచూసిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 200 కేసులు ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ కారణంగా సోకాయని నిర్దారణ కావడంతో ఈ అంశంపై భార్గవ స్పందించారు.

 ‘‘ సార్స్‌–కోవ్‌–2 తరచూ సహజంగా పరివర్తనం చెందుతోంది. దాని ఉత్పరివర్తనమే ఎక్స్‌ఎఫ్‌జీ. ఇది సహజ ఆవిర్భావమే’’ అని ఆయన అన్నారు. జూన్‌ 11వ తేదీనాటికి దేశవ్యాప్తంగా కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 7,000 మార్కును దాటింది. గత 24 గంటల్లోనే 300 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోవిడ్‌ కారణంగా కన్నుమూశారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

సార్స్‌–కోవ్‌–2 జన్యువిశ్లేషణ కన్సార్షియం(ఇన్సాకాగ్‌) తాజా గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా 206 దాకా ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ కేసులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎక్స్‌ఎఫ్‌జీ కేసులున్నాయి. వాటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 89, పశ్చిమబెంగాల్‌ నుంచి 49, కేరళలో 15, తమిళనాడులో 16, గుజరాత్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, ఒడిశాలో మూడు, తెలంగాణ ఒక కేసు నమోదయ్యాయి. ‘‘మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ ఏమార్చగలదని తొలుత వార్తలొచ్చాయి. వాటిల్లో నిజం లేదు. ఈ వేరియంట్‌ సోకిన వారిలో వ్యాధి ముదురుతుందనే బలమైన ఆధారాలు లేవు’’ అని భార్గవ అన్నారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)