Breaking News

కొత్త వందేభారత్‌ రైళ్లు.. కర్నాటక, మహారాష్ట్ర.. వయా తెలంగాణ

Published on Thu, 07/24/2025 - 12:39

బెంగళూరు: దక్షిణాదికి మరిన్ని వందేభారత్‌ రైళ్లు రానున్నాయి. ఇవి కర్నాటకలోని బెలగావితో పూణే, హైదరాబాద్‌లను అనుసంధానించనున్నాయి. ఈ కొత్త రైళ్లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రధాన నగరాలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.

భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ (హైదరాబాద్) లకు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టాక పూణే నుండి బయలుదేరే మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య ఆరుకు చేరనుంది.

కర్నాటకలోని కలబుర్గి నుంచి పూణే- హైదరాబాద్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలు మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణలోని ప్రధాన నగరాలను కలపనుంది. కర్నాటకలోని బెలగావి ప్రజలు చాలా కాలంగా హుబ్బళ్లి-బెలగావి-పుణే మార్గంలో రోజువారీ సెమీ-హై-స్పీడ్ రైలును నడపాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు నడపబోయే ఈ కొత్త వందే భారత్ రైలు ఈ డిమాండ్‌ను తీర్చనుంది. పూణే-షెగావ్ వందే భారత్ రైలు దౌండ్, అహ్మద్‌నగర్, ఛత్రపతి సంభాజీనగర్ జల్నాలలో ఆగనుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గజానన్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉండనుంది.  

అలాగే పూణే-వడోదర మధ్య నడవబోయే రైలు మహారాష్ట్ర గుజరాత్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వందేభారత్‌ రైళ్లలో సౌకర్యవంతమైన సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, వైఫై యాక్సెస్, ఆధునిక టాయిలెట్లు మెరుగైన భద్రతా  ఏర్పాట్లు ఉంటాయి. కాగా ఈ కొత్త వందేభారత్‌ రైలు సేవల అధికారిక షెడ్యూల్‌ను రైల్వే శాఖ ఇంకా ధృవీకరించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని సమాచారం. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)