Breaking News

Train Ticket: రైల్వే శాఖ కొత్త రిజర్వేషన్‌ విధానం

Published on Tue, 09/16/2025 - 17:25

రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ కొత్త నిబంధ‌న అమ‌ల్లోకి తెస్తుంది. 

న్యూఢిల్లీ: జనరల్‌ టిక్కెట్ల రిజర్వేషన్‌కు బుక్కింగ్స్‌ మొదలైన మొదటి 15 నిమిషాలను ఆధార్‌ ధ్రువీకరణ ఉన్న యూజర్లను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. రైలు ఏదైనా బుక్కింగ్స్‌ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా రిజర్వేషన్‌ చేయించుకునే టిక్కెట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్‌ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.

‘ఉదాహరణకు ఒక రైలు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు బయలుదేరనుంది. ఆ రైలుకు రిజర్వేషన్లు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే, మొదటి 15 నిమిషాలు ఆధార్‌ ధ్రువీకరణ ఉన్న వారికే రిజర్వేషన్‌ చేసుకునే అవకాశముంటుంది’అని వివరించింది. ఇప్పటి వరకు తత్కాల్‌ (Tatkal) రిజర్వేషన్లకు మాత్రమే ఈ నిబంధన ఉండేది.

రిజర్వేషన్‌ విధానం ప్రయోజనాలు సాధారణ వినియోగదారునికి కూడా అందేందుకు, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ సోమవారం ఒక సర్క్యులర్‌లో వివరించింది. కౌంటర్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకునే ఏజెంట్లకు ప్రస్తుతమున్న మొదటి 10 నిమిషాల నియంత్రణ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. 

చ‌ద‌వండి: జేఈఈ లేకుండానే.. ఐఐటీలో సీటు!

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)