Breaking News

ఐఫోన్‌ క్రేజ్‌ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్‌ అమ్మి మరీ!

Published on Fri, 09/18/2026 - 16:26

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్‌ ఐఫోన్లకు క్రేజ్‌ అంతా ఇంతకాదు. ఎలాగైనా  లేటెస్ట్‌  ఐఫోన్‌ దక్కించుకోవాలని ఉబలాట పడతారు ఐఫోన్‌ లవర్స్‌. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ప్రారంభం కావడంతో నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం. తాజా ఐఫోన్‌ను దక్కించుకోవడం కోసం కొనుగోలుదారులుగంటల తరబడి వేచి చూశారు. ఈ సందర్బంగా  భార్యకు కొత్త ఐఫోన్‌ కొనిచ్చేందుకు ఏకంగా బంగారాన్ని అమ్మేసిన వైనం నెట్టింట విచిత్రంగా నిలుస్తోంది. 

ఐఫోన్‌నుదక్కించుకునేందుకు ఒక్కొక్కరి  కష్టాలు మామూలుగా లేవు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మహిళలు  స్టోర్‌ ఓపెన్‌ చేయకముందు షాప్‌ ముందు క్యూ కట్టారు. కొందరు  ఐఫోన్‌ దక్కిచంచుకోవడం కోంసం సెలవు కూడా తీసుకున్నారు.ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో  వైరల్‌గా మారాయి.

బంగారం అమ్మి మరీ...
ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య కోరిక మేరకు బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి  బంగారం అమ్మినట్లు తెలిపారు. "ఆనాడు డబ్బులు లేవు, నేడు ఉన్నాయి, రేపు ఉంటాయో లేదో" అని చెబుతూ తన భార్య కోసం ఈ ఫోన్ కొన్నానని ఆయన వెల్లడించారు.తన భార్య 'బర్గుండి' (Burgundy) రంగులో ఉన్న iPhone 18 Proని తీసుకురమ్మని చెప్పిందని ఆయన తెలిపారు.

పెళ్లి కానుకగా ఐఫోన్
పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కానుకగా కాబోయే భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. తనకోసం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో కలిపి మొత్తం రెండు ఫోన్ల కోసం ఆయన రూ. 3.5 లక్షలకు పైగా వెచ్చించారు.

ధరల పెంపు లెక్కే కాదు
ఐఫోన్ ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ, ఐఫోన్ ప్రేమికులు ఈ ధరను చెల్లించడానికి వెనుకాడబోరని కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. హర్యానాకు చెందిన విశాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ధరలు పెరిగినా తాము సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.

ముందస్తు బుకింగ్స్
స్టోర్ వద్ద తీవ్ర రద్దీ నెలకొనగా, ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్నవారికే మాత్రమే స్టోర్‌లోకి ప్రవేశం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకోని కొందరు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

తొలి ఫోన్‌ అందుకున్న ఆనందం 
అంతేకాదు  ఇండియాలో అందరికంటే ముందే తానే కొత్త  ఐఫోన్‌నుసొంతం చేసుకోవాలనే ఆశతో ఏకంగా 10–12 గంటల పాటు క్యూలో నిలబడ్డావో వ్యక్తి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్  వద్ద రాత్రంతా వేచి చూసి, భారత్‌లో తొలి iPhone 18 ను  సొంతం చేసుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన సంగతి సోషల్‌మీడియాలో సందడిగా మారింది. 

 

#

Tags : 1

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)