Breaking News

సుప్రీంకోర్టు.. అసలైన ప్రజాకోర్టు

Published on Wed, 01/29/2025 - 05:11

న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు అసలు సిసలైన ప్రజా న్యాయస్థానం అని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా(Sanjiv Khanna) స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డైమండ్‌ జూబ్లీని పురస్కరించుకొని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం  ప్రత్యేకంగా కొలువుదీరింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాట్లాడుతూ... ధర్మాసనం మన సుప్రీంకోర్టు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను, మన సమాజంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన, సమర్థవంతమైన న్యాయస్థానంగా ఎదిగిందని హర్షం వ్యక్తంచేశారు.

ఏళ్ల క్రితం మన ప్రయాణం మొదలైందని అన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) 1950 జనవరి 28 నుంచి ఆమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిజమైన ప్రజల కోర్టుగా  ప్రదర్శించిన విశిష్టమైన గుణమే మన సుప్రీంకోర్టును ఉన్నత స్థానంలో నిలిపిందని జస్టిస్‌ ఖన్నా వివరించారు. 75 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కాలానుగుణంగా మార్పులను అందిపుచ్చుకుంటూనే రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో మన సుప్రీంకోర్టు పనిచేస్తోందని వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేకూరుస్తూ ప్రజల కలలను నిజం చేస్తోందని చెప్పారు. న్యాయ వ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటని అధిగమిస్తూ ముందుకెళ్లాలని న్యాయవాదులు, న్యాయమూర్తులకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పిలుపునిచ్చారు. మన అత్యున్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉందని వివరించారు.  

ప్రాణంలేని శిల్పం కాదు.. సజీవ సంస్థ  
న్యాయం అనేది కేవలం ఉత్తర్వుల్లోనో, నోటి మాటగానో కాకుండా ఆచరణాత్మకంగానూ ఉండాలన్నదే తమ ఉద్దేశమని జస్టిస్‌ ఖన్నా వివరించారు. ప్రజల హక్కులను కాపాడడంలో, వారికి చేరువకావడంలో సుప్రీంకోర్టు ముందంజలో ఉందన్నారు. ప్రస్తుతం మూడు రకాల సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోర్టు ఖర్చులు పెరిగిపోతుండడంతో ప్రజలు న్యాయం పొందడంలో ఆలస్యం జరుగుతోందని అన్నారు. చాలామంది ఖర్చులకు భయపడి కోర్టుల వరకు రావాలంటే సంకోచిస్తున్నారని తెలిపారు. అసత్యమే సత్యంగా చెలామణి అవుతున్న చోట న్యాయం బతికి బట్టకట్టడం కష్టమని వ్యాఖ్యానించారు. సవాళ్లను పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

కోర్టు రూమ్‌ల్లో న్యాయమూర్తుల్లోనూ వైవిధ్యం ఉందని, భిన్నప్రాంతాల నుంచి వచ్చినవారు జడ్జిలుగా సేవలందిస్తున్నారని తెలిపారు. తద్వారా న్యాయ వ్యవస్థలో ప్రజల గొంతుక వినిపించే అవకాశం దక్కుతోందని అభిప్రాయపడ్డారు. 7 దశాబ్దాలకుపైగా సాగుతున్న ప్రయాణంలో సుప్రీంకోర్టు ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు అంటే రాతి నుంచి చెక్కిన ప్రాణంలేని శిల్పం కాదని, ఇదొక సజీవ సంస్థ అని ఉద్ఘాటించారు. 1990వ దశకంలో పౌరుల హక్కుల పరిరక్షణతోపాటు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య అంతరాన్ని పూడ్చేందుకు కృషి చేసిందని వివరించారు.

21వ శతాబ్దంలో సుప్రీంకోర్టు పాత్ర మరింత పెరిగిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ నుంచి పర్యావరణ పరిరక్షణ దాకా.. మేధోసంపత్తి హక్కుల నుంచి గోప్యత దాకా.. ఇలా ఎన్నో అంశాలపై తీర్పులిచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయాలకు భారతదేశ ఆర్థికవ్యవస్థను సైతం బలోపేతం చేశాయన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో హామీలు సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా వాస్తవరూపం దాల్చాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)