Breaking News

బాలరామునికి నేపాల్‌ నుంచి కానుకలు!

Published on Sat, 02/24/2024 - 14:27

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు బాలరాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా బాలరాముని దర్శనం కోసం జనం తరలివస్తున్నారు. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్ అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన తనతోపాటు బాలరామునికి ఐదు కానుకలు తీసుకువచ్చారు. 

అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేపాల్ విదేశాంగ మంత్రికి యూపీకి చెందిన సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. నేపాల్ విదేశాంగ మంత్రితో పాటు ఆయన భార్య జ్యోత్స్నా సౌద్ కూడా అయోధ్యకు వచ్చారు. ఈ దంపతులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నేపాల్ విదేశాంగ మంత్రి రామ్‌లల్లాకు ఐదు రకాల వెండి ఆభరణాలను సమర్పించారు. వీటిలో విల్లు, గద, కంఠహారం, చేతులు, కాళ్లకు ధరించే కంకణాలు మొదలైనవి ఉన్నాయి. విదేశాంగ మంత్రి సౌద్ అయోధ్యను సందర్శించడానికి వచ్చిన నేపాల్ ప్రభుత్వ తొలి మంత్రి. ఆయన సరయూ నది ఒడ్డున  సాయంత్రం జరిగే హారతిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే హనుమాన్‌గర్హి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)