Breaking News

Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు

Published on Mon, 02/24/2025 - 13:54

ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి.. ‘హరహర మహాదేవ..శంభో శంకర’(Hara Hara Mahadeva..Shambho Shankara) అంటూ శివనామస్మరణలతో మారుమోగనున్న శివాలయాలు. భక్తిపావశ్యంలో శివభక్తులు మునిగితేలే వేళ.. నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయానికి లెక్కకుమించినంతమంది భారతీయులు తరలివెళ్లనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్‌ నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు  తరలివెళుతున్నారు. భాగమతి నది ఒడ్డున ఉన్న ఐదవ శతాబ్దపు ఈ ఆలయంలో శివరాత్రి పూజలు నిర్వహించేందుకు నాలుగువేల మంది సాధువులతో పాటు, వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారని పశుపతినాథ ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయని పశుపతి ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు.

శివరాత్రి(Shivaratri) రోజున భక్తుల భద్రతకు 10 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. అలాగే 5,000 మంది స్వచ్ఛంద సేవకులను భక్తులకు సేవలు అందించనున్నారు. మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2.15 గంటలకు పశుపతినాథ్ ఆలయం తెరుచుకుంటుందని, ఆలయంలోని నాలుగు ద్వారాల నుండి భక్తులు మహాశివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు  అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మాంసం, చేపల అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ ఖాట్మండు జిల్లా పరిపాలన కార్యాలయం(Kathmandu District Administration Office) నోటీసు జారీ చేసింది. సోమవారం నుండి గురువారం వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.  హిమాలయాలు శివుని నివాసమని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. నేపాల్‌లో పెద్ద సంఖ్యలో శైవులు ఉన్నారు. వీరు శివుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తుంటారు.

ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్‌ పింఛనెంత?

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?