Breaking News

దేశ ఆర్ధిక మంత్రిని.. ఫుట్‌బాల్‌ తన్నినట్లు తన్నారు.. వీడియో వైరల్‌

Published on Tue, 09/09/2025 - 21:22

కాఠ్మాండూ: నేపాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఆర్థిక మంత్రి బర్షమాన్ పున్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి పున్‌ను జెన్‌జీ ఆందోళనకారులు వెంటపడిమరీ దాడి చేశారు. ఆందోళ కారుల్లో ఓ వ్యక్తి పున్‌ను ఫుట్‌బాల్‌ తన్నినట్లు తన్నారు. ఆ ఊహించిన పరిణామంతో పున్‌ ఎగిరి అవుతలపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న బర్షమాన్ పున్‌ ఇటీవల ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ క్రమంలో ఆయనపై ప్రజలు తమ కోపాన్ని వ్యక్తం చేశారు.

వీడియోలో మంత్రి పున్‌ ఒక వీధిలో నడుస్తుండగా, కొంతమంది వ్యక్తులు ఆయనను వెంబడిస్తూ  తిడుతూ,దేహశుద్ధి చేశారు. భద్రతా సిబ్బంది ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినా, ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళన కారుల నుంచి రక్షించేందుకు విశ్వప్రయాత్నాలు చేశారు. చివరకు వారి చేతుల్లో బర్షమాన్‌ పున్‌ ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగారు.  

ఈ ఘటనపై నేపాల్ రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పిలుపు కూడా వినిపిస్తోంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)