Breaking News

భారత సరిహద్దుల్లో హైఅలర్ట్‌

Published on Wed, 09/10/2025 - 07:12

ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్‌లో అస్థిరత కారణంగా మెరుగైన జీవితం కోసం భారత్‌లోకి నేపాలీలు చొరబడే ప్రమాదం ఉండటంతో 1,751 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంట సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ) బలగాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. సున్నితమైన పాయింట్లతోపాటు బోర్డర్‌ పోస్ట్‌ల వద్ద భద్రతను మరింత పెంచారు. 22 ఔట్‌పోస్ట్‌ల వద్ద అదనపు బలగాలను రప్పించారు. పోలీస్, ఎస్‌ఎస్‌బీ బృందాలు పెట్రోలింగ్‌ను తీవ్రతరంచేశాయని ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ వికాస్‌ చెప్పారు.

భారతీయులకు అడ్వైజరీ జారీ
సంక్షోభ నేపాల్‌కు వెళ్లొద్దని భారతీయులకు భారత విదేశాంగ శాఖ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. వివిధ కారణాలతో ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వైపు వెళ్లొద్దని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాటని, భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లో అత్యవసరమైతే సంప్రతింపులు కొనసాగించాలని ఎమర్జెన్సీ ఫోన్‌ నంబర్లు 977 – 980 860 2881; 977 – 981 032 6134 వెల్లడించింది. అయితే గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాకు చెందిన 40మందికిపైగా భక్తులు తీర్థయాత్ర కోసం నేపాల్‌కు వెళ్లి అక్కడే చిక్కుకుపో యారని తాజా సమాచారం.

ప్రధాని మోదీ సమీక్ష
తాజా పరిణామాలపై భారత ప్రధాని మోదీ ఢిల్లీలో మంగళవారం సమీక్ష జరిపారు. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది. తర్వాత భేటీపై మోదీ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘నేపాల్‌లో తాజా పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ఎందరో యువకులు బలయ్యారు. అక్కడ శాంతి నెలకొనడం తక్షణావసరం. నేపాలీలంతా సంయనంతో మెలగాలని కోరుకుంటున్నా’’అని మోదీ విజ్ఞప్తిచేశారు. నేపాల్‌లో జెన్‌జీ ఉద్యమాన్ని సుదన్‌ గురంగ్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి నడుపుతున్నారు. యువత సారథ్యంలో నడిచే ‘హమి నేపాల్‌’సంస్థకు ఇతను అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)