Breaking News

ముగిసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌

Published on Sun, 06/21/2026 - 12:11

నీట్ యూజీ అప్‌డేట్స్‌

ముగిసిన రీ-ఎగ్జామ్‌

  • నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష ముగిసింది 

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగింది

కొనసాగుతున్న పరీక్ష

  • కొనసాగుతున్న నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష 

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష

  • పెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ యూజీ

నీట్‌ యూజీ ప్రారంభం 
దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష నేటి (జూన్ 21, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల ప్రారంభమైంది. అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. 

దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు నేషనల్... టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

మాల్‌ప్రాక్టీస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు మరియు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియలను అమలు చేస్తున్నారు. హై-సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులకు క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్‌టీఏ ముందే సూచించింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)