Breaking News

ఆరో తరగతిలోనే పెళ్లి.. చదువు వద్దన్న తండ్రి.. తగ్గేదేలేదన్న భార్య

Published on Tue, 06/20/2023 - 17:00

'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు.. పట్టెనేని బిగియ పట్టవలయు..' అనే వేమన పద్యం అందరికీ తెలిసే ఉంటుంది. రాజస్థాన్‌కు చెందిన ఓ యువకునికి వేమన చెప్పిన మాటలు సరిగ్గా సరిపోలుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విడువకుండా తన లక్ష‍్యాన్ని చేరుకున్నాడు ఈ కుర్రాడు. ఇంతకీ ఇతను ఏం సాధించాడు. విజయ సాధనలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటో తెలుసుకుందాం పదండి..

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడి విజయం సాధించారు. ఇందులో రాజస్థాన్‌కు చెందిన యువకుడు రామ్‌లాల్ కూడా ఉన్నాడు. ఏకంగా 490 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే.. నీట్‌లో పాస్‌ అయినవాళ్లందరి ప్రయత్నం ఓ వైపు.. రామ్‌లాల్‌ కృషి మరో వైపు.. 

11 ఏళ్లకే బాల్య వివాహం..
రామ్‌లాల్ చిత్తోర్‌గఢ్‌లోని ఘోసుండా ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ యువకునికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా గొప్పగా సాధించాలనే కలలు కనేవాడు. చదువుల్లో మంచిగా రాణిస్తున్న ఇతనికి 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు అతను కేవలం 6వ తరగతి చదువుతున్నాడు. 


11 ఏళ్లకు పెళ్లిపీటలెక్కిన రామ్‌లాల్‌

భార్య సహకారంతో..
తన కల నీరుగారిపోయిందనుకున్న రామ్‌లాల్‌కు భార్య సహకారం తోడయింది. ఆయన భార్య పదో తరగతి వరకు చదువుకుంది. పుస్తకం విలువ తెలిసిన ఆమె భర్తకు అండగా నిలబడింది. రామ్‌లాల్ తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తన భర్త చదువుకోవడానికి పూర్తి తోడ్పాటును అందించింది. దీంతో రామ్‌లాల్‌ 10వ తరగతిలో 74 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం తనకు ఇష్టమైన  సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. 

అలుపెరుగని ప్రయత్నం..
2019లో మొదటి సారి నీట్ పరీక్షను రామ్‌లాల్ రాశాడు. 720 మార్కులకు గాను 350 వచ్చాయి. మెరుగైన ఫలితాలు రాలేదు. కానీ ఏ మాత్రం క్రుంగిపోకుండా ప్రయత్నాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. కోటా నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్‌లో చేరి మెలుకువలు నేర్చుకున్నాడు. ఈ సారి 632 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు.

350 మార్కుల నుంచి ఐదో సారికి 632కి చేరుకున్నానని రామ్‌లాల్ చెబుతున్నాడు. కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చని అంటున్నాడు. తన భార్య ఇచ్చిన సహకారాన్ని కొనియాడుతున్నాడు. ఇక నీట్‌ 2023 పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రామ్‌లాల్‌ దంపతులకు పాప పుట్టడం మరో విశేషం.
ఇదీ చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)