Breaking News

NEET NTA: తప్పు జరిగితే ఒప్పుకోండి

Published on Tue, 06/18/2024 - 12:22

న్యూఢిల్లీ, సాక్షి:  NEET- 2024 పరీక్ష అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధ్యత గల సంస్థగా NTA పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పు జరిగితే ఒప్పుకుని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

నీట్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ‘‘నీట్‌పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగదు. పిల్లలు పరీక్షలకు సిద్ధం అయ్యారు. వాళ్ల కఠోర శ్రమను మనం వృథా చేయొద్దు. పరీక్షను నిర్వహించే సంస్థగా.. మీరు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరిగితే.. ‘అవును తప్పు జరిగింది’ అని చెప్పండి. అప్పుడు మేం చర్యలు తీసుకుంటాం. కనీసం ఇలాగైనా పని తీరు మెరుగుపడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుందేమో’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

.. అలాగే విద్యార్థుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలి. నీట్ పరీక్ష వ్యవహారంలో 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలి’’ అని ఎన్టీయేకు సుప్రీం బెంచ్‌ సూచించింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. 

మరోవైపు నీట్‌ వ్యవహారంలో ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే వేసిన పిటిషన్‌పైనా జూన్‌ 13వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ.. కేంద్రం, ఎన్టీయేలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ తదుపరి విచారణను జులై 8వ తేదీకే వాయిదా వేసింది.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)