Breaking News

నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా

Published on Sun, 10/20/2024 - 05:38

కోల్‌కతా: ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. 

ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌ శనివారం కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్‌ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)