Breaking News

రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!

Published on Mon, 06/08/2026 - 15:03

నెలకు ఐదెంకల జీతం వస్తున్నా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. దయచేసి ఏం చేయాలో సలహా ఇవ్వండి అంటూ ఒక జంట  పెట్టిన పోస్ట్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. నేటి తరం యువ దంపతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. నెలకు రూ. 1.7 లక్షల సంపాదన ఉన్నప్పటికీ, నెలాఖరుకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగలడం లేదని వాపోయింది. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇంత జీతం వస్తున్నా ఈఎంఐలు,అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆ జంట చెప్పుకు రావడం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయమే.  నిజానికి  మామూలు మధ్యతరగతి కుటుంబానికి దాదాపు 2 లక్ష రూపాయలు జీతం అంటే సౌకర్యవంతంగానే గడిపేయొచ్చు. వీరి ఖర్చులు, కడుతున్న లోన్ల వివరాల ప్రకారం వీరి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తే లోన్ల భారమే కారణంగా చెప్పవచ్చు.  

వ్యక్తిగత రుణం (Personal Loan), విద్యా రుణం (education loan), బైక్ రుణం , ఫోన్ రుణం వంటి వాటి కోసం వారి నెలవారీ EMIల మొత్తం రూ. 85,980 అవుతోంది. ఇవి కాకుండా  ఆ దంపతులు ఇంటి అద్దె, నిర్వహణ ఖర్చులు, సరుకులు, ప్రయాణం, వైద్య ఖర్చులు , ఇతర వినియోగ బిల్లుల వంటి స్థిరమైన నెలవారీ ఖర్చుల కోసం రూ. 53,500 వెచ్చిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత ఖర్చులు, వినోదం , కుటుంబపరమైన అత్యవసర అవసరాల కోసం వారు రూ. 28వేలు కేటాయించారు. అన్ని ఖర్చులు పోను, వారి చేతిలో నెలకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగులుతున్నాయి.

ఇదీ చదవండి: నర్సింగ్‌ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునే ముందు, ముందుగా తమ అప్పులను తీర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చాలా మంది  నెటిజన్లు సూచించారు.

ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్‌, చెల్లితో పెళ్లి ఫిక్స్‌, మళ్లీ ప్రియుడి లొల్లి!

ఖర్చులు కాదు బాబూ, మీ లోన్లే మీకు అసలు సమస్య: కనీసం పెర్సనల్‌ లోన్‌ అయినా తీర్చేంత వరకైనా మీకీ కష్టాలు తప్పవు. మీ బైక్ రుణం పూర్తయ్యే వరకు 4 నెలలు వెయిట్‌ చేసి, ఆ తర్వాత, ఆ 12 వేల రూపాయల పెర్సనల్‌ లోన్‌  చెల్లించేయండి అని   ఇంకొకరు సలహా ఇచ్చారు.   అంతేకాదు లోన్‌ తీసుకొని మరీ ఫోన్‌  తీసుకోవడం అవసరమా,  3-4 నెలల పాటు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకుని ఉంటే, ఫోన్ కోసం 20వేలు మిగిలేవి  కదా అంటే ఇంకొకరు లెక్కలు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్

అంటే ఈ జంట తమ సంపాదనలో సగానికి పైగా (50.5%) కేవలం అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తున్నారు. ఆర్థిక సూత్రాల ప్రకారం ఈఎంఐలు ఆదాయంలో 30-35  శాతం  కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే అనవరమైన వ్యక్తిగత అవసరాలను కొన్ని  త్యాగం చేసి అత్యవసర ఖర్చులకోసం, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడం కుటుంబాలకు చాలా అవసరం.ఏమంటారు? 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)