Breaking News

ఎన్డీఏ సర్కారు త్వరలోనే కూలుతుంది: ఖర్గే

Published on Sun, 06/16/2024 - 04:41

బెంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున మూడోసారి అధికారంలోకి వచి్చందని, త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచి్చంది. ప్రజల తీర్పు మోదీకి అనుకూలంగా లేదు. ఈయనది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అతిత్వరలో కుప్పకూలుతుంది’అని పేర్కొన్నారు. 

‘దేశ క్షేమం కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నాం. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తాం. కానీ, మన ప్రధానికి సవ్యంగా కొనసాగే ఏ పనికైనా అవాంతరం కల్పించడం అలవాటు. అయినప్పటికీ దేశం కోసం మేం సహకారం అందిస్తూనే ఉంటాం’అని ఖర్గే అన్నారు. 

భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై ఉంచడంలో బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ చీఫ్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు. 
ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ పక్షాలైన జేడీయూ, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ), హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎం) తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్‌ సారథ్యంలో పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ల ప్రభుత్వాలు ఎలా కొనసాగాయో చరిత్ర చెబుతోందని ఖర్గేను ఎద్దేవా చేశాయి. కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావు రాజకీయ చతురతతో రెండేళ్లలోనే మెజారిటీ ప్రభుత్వంగా మారిందని జేడీయూ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు పొరపాటున కొంత బలం పుంజుకున్నాయని, ప్రతిపక్ష పోషించాలని రిపబ్లికన్‌ పార్టీ, హెచ్‌ఏఎంలు ఖర్గేకు సలహా ఇచ్చాయి. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)