Breaking News

కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్‌కు భారీ ఝలక్‌

Published on Fri, 04/14/2023 - 20:40

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ తగిలింది. విపక్షాల ఐక్యత పేరిట కాంగ్రెస్‌తో దోస్తీలో ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP).. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్‌ కీలక నేతలతో ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ, తామంతా ఒక్కటేనంటూ ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

కర్ణాటక ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన ఎన్‌సీపీ.. 40 నుంచి 45 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ తరుణంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఆశ్చర్యకర రీతిలో ఎన్‌సీపీ పోటీలోకి దిగుతోంది. ఈ పోటీ మిత్రపక్షం కాంగ్రెస్‌ అవకాశాలపై ప్రభావం చూపించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

తాజాగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన ఎన్‌సీపీకి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ క్లాక్‌ సింబల్‌నే కేటాయించడం విశేషం. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో మరాఠా జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో  మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి భాగస్వామ్యంతో ఎన్‌సీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అదానీ వ్యవహారంపై జేపీసీ డిమాండ్‌ విషయంలో పవార్‌, విపక్షాల(కాంగ్రెస్‌ నేతృత్వంలోని) నుంచి విభేదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం పవార్‌, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలతో భేటీ అయ్యారు. బీజేపీపై పోరుకు విపక్షాల ఐక్యత పేరిట ఒక్కటిగా ముందుకు సాగాలని ఈ భేటీలో తీర్మానించుకున్నారు కూడా. ఈలోపే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు గండికొట్టే నిర్ణయం ఎన్‌సీపీ తీసుకోవడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)