Breaking News

108 దేశాల్లో ‘నవకార్‌ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ

Published on Wed, 04/09/2025 - 11:04

న్యూఢిల్లీ: నవకార్‌ మహామంత్రం పరమ పవిత్రమైనదని, దీనిని సామూహికంగా పఠించడం వలన ప్రపంచ శాంతి, సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈరోజు(బుధవారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘నవకార్‌ మహామంత్ర దివస్‌’(Navkar Mahamantra Day)లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Prime Minister Modi) నవకార్ మహామంత్రానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది జైనమతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణిస్తారని, ఇది ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా  మనమంతా శాంతి,  మానసిక శక్తి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
 

‘నవకార్‌ మహామంత్ర దివస్‌’ మహావీర జయంతికి ఒక రోజు ముందు నిర్వహిస్తుంటారు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన పౌరులు నవకార్ మహామంత్రాన్ని సామూహికంగా జపించారు. ఇది  ప్రపంచ ఐక్యత, ఆధ్యాత్మిక జాగృతిని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక  కార్యక్రమంగా నిలిచింది. ఈ మంత్రం జైనమతం(Jainism)లోని ఐదు ప్రధాన ఆరాధనా విభాగాలైన అరిహంతులు (మోక్షం పొందిన ఆత్మలు), సిద్ధులు (పరిపూర్ణ జ్ఞానం పొందినవారు), ఆచార్యులు (ఆధ్యాత్మిక గురువులు), ఉపాధ్యాయులు (ఉపదేశకులు),సాధువులు (సన్యాసులు)కు మనమిచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలలో ఏకకాలంలో జరిగింది. భారతదేశంలో 6,000 ప్రదేశాలలో ఈ ఉత్సవం నిర్వహించారు. దీనిని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇది కూడా చదవండి: పాక్‌లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు