Breaking News

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాక్‌.. సోనియా, రాహుల్‌కు ఊరట

Published on Tue, 12/16/2025 - 11:33

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన తాజా చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ జరిపిన దర్యాప్తు.. కొత్తగా నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కాకుండా, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వుల ఆధారంగానే జరిగిందని కోర్టు గమనించింది. అందుకే ఎఫ్‌ఐఆర్ కాపీని పొందే అర్హత ఈ దశలో నిందితులకు లేదని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది.

ఈ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)సోనియా , రాహుల్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తమ అగ్ర నాయకత్వంపై కేంద్రంలోని మోదీ-షా ద్వయం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా అవాస్తవమని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ వాదించింది.

కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ వాదనలను నిరాధారమని కొట్టిపారేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైనప్పుడు ప్రధాని మోదీ పదవిలో లేరని, ఈ కేసు 2008 నాటిదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు మానుకొని, వారు చేసిన దోపిడీకి లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని ఆయన  పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ 120(బి), మోసానికి సంబంధించిన సెక్షన్ 420 కింద ఫిర్యాదులు నమోదయ్యాయని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ కేసు పాతది కాబట్టి దీనిని పాత శిక్షాస్మృతి (పెనల్ కోడ్) కింద నమోదు చేశారని ఆయన తెలియజేశారు. కాగా ఈ కేసులో గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, ఈడీ తదుపరి దర్యాప్తుకు కోర్టు అనుమతించడం ఉత్కంఠ కలిగిస్తోంది. 

ఇది  కూడా చదవండి: విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)