Breaking News

అంతరిక్షం నుంచి గంగా నది డెల్టా కనువిందు 

Published on Mon, 08/11/2025 - 06:33

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి భారత్‌లోని గంగా నది డెల్టా ప్రాంతం కనువిందు చేస్తోంది. నాసా వ్యోమగామి డాన్‌ పెటిట్‌ ఈ ఫోటోను చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. గంగా నది డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద రివర్‌ డెల్టాగా గుర్తింపు పొందింది. తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సారవంతమైన భూములు, పచి్చక బయళ్లకు పెట్టింది పేరు. దీన్ని గంగా–బ్రహ్మపుత్ర డెల్టా లేదా బెంగాల్‌ డెల్టా లేదా సుందర్బన్స్‌ డెల్టా అని కూడా అంటారు. 

విస్తీర్ణం లక్ష చదరపు కిలోమీటర్లకు పైమాటే. లక్షలాది మందికి ఇదొక జీవరేఖ. డాన్‌ పెటిట్‌ నియర్‌–ఇన్‌ఫ్రారెడ్‌ ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని బందించారు. నదులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోకు సోషల్‌ మీడియాలో, సైన్స్‌ చానళ్లలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు డాన్‌ పెటిట్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా కళాత్మక దృష్టి కూడా ఇందులో కనిపిస్తోంది.   
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)