చిన్నారులతో పాటు చీపురు పట్టిన ప్రధాని మోదీ

Published on Wed, 10/02/2024 - 12:10

న్యూఢిల్లీ: నేడు (బుధవారం) దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో స్కూల్ పిల్లలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చీపురు పట్టి, పరిసరాలను పరిశుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.  

‘స్వచ్ఛతా హి సేవా 2024’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న భారత దేశాన్ని అందరం కలిసి సాకారం చేద్దామన్నారు. అందుకు ఈరోజు మనకు ఈ స్ఫూర్తిని  అందిస్తుందన్నారు. నేటితో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రయాణం 10 సంవత్సరాల మైలురాయిని చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు.

గత పక్షం రోజుల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంతర కృషితోనే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చుకోగలం. ఈ రోజున పరిశుభ్రతకు సంబంధించిన సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మిషన్ అమృత్ కింద దేశంలోని పలు నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించనున్నామన్నారు.  ఇది స్వచ్ఛ భారత్ మిషన్‌ను మరో మైలురాయి దాటిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)