Breaking News

Narendra Modi: దేశ పురోభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉంది: మోదీ

Published on Fri, 10/18/2024 - 05:45

చండీగఢ్‌: బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) దేశ పురోగతికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి అంకితభావంతో కృషి చేస్తుందని  ప్రధాని మోదీ అన్నారు. పేదలు, దిగువవర్గాల అభ్యున్నతికి, సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. హరియాణా సీఎం నయాబ్‌సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం మోదీ ఇక్కడి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంతులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. 

మొత్తం 17 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మోదీ ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన అందించడం, ప్రజలు జీవితాలను మెరుగుపర్చడంపై సు దీర్ఘంగా చర్చించాం. దేశ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పేదలు, అట్టడుగువర్గాలకు సాధికారతను కల్పించడానికి ఎన్డీయే కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తదితర ఎన్డీయే మిత్ర పక్షాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హరియాణా విజయా న్ని సానుకూలంగా మలచుకొని మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలను ఎదుర్కొనాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మొత్తం ఆరు తీర్మానాలను ఆమోదించినట్లు జేపీ నడ్డా తెలిపారు. ఎమర్జెన్సీ ఖండిస్తూ అమిత్‌ షా తీర్మానం పెట్టగా, రాజ్యంగం అమృతమహోత్సవంపై రాజ్‌నాథ్‌ తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం