Breaking News

మూడింటినీ మోదీ పరిష్కరించారు

Published on Sat, 11/29/2025 - 05:11

రాయ్‌పూర్‌: నక్సలిజంతోపాటు ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదం, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సమస్యలను ప్రధాని మోదీ శాశ్వతంగా పరిష్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మూ డ్రోజులపాటు జరిగే డైరెక్టర్స్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌/ ఇన్‌స్పెక్టర్స్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ/ఐజీపీ)ల వార్షిక సదస్సులో శుక్రవారం అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. 

‘‘మాదక ద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాల ముఠాలపై అన్ని వైపుల నుంచి పోలీసులు ముప్పేట దాడులు చేయాలి. మత్తుపదార్థాల అక్రమరవాణా ముఠాలు, నేరగాళ్లకు దేశంలో నిలువనీడలేకుండా చేయాలి. లక్ష్యంపై సాటిలేని గురి, నిఘా, సమర్థవంతమైన ప్రణాళికతో భద్రతా బలగాలు, పోలీసులు దేశంలోని అతివాదం, వేర్పా టువాదం, మత్తు మహమ్మారిల అంతుచూస్తు న్నారని అమిత్‌ షా కొనియాడారు. 

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోతో ఇక అన్ని రాష్ట్రాల పోలీస్‌విభాగాలు కలిసి పనిచేస్తూ రాష్ట్ర,దేశ, అంతర్జాతీయ స్థాయిలో చీకటి వ్యాపారంచేస్తున్న డ్రగ్స్‌ ముఠాల సూత్రాధారులను బంధించి చట్టం ముందు నిలబెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ఇండియా వంటి నిషేధిత సంస్థను కూకటివేళ్లతో పెకలించి రాష్ట్ర, కేంద్ర బలగాలు తమ సమిష్టకృషిని అద్భుతంగా చాటాయి. 

40 ఏళ్లుగా పట్టిపీడిస్తున్న నక్సలైట్ల దాడి బెడదను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా 586 పోలీస్‌స్టేషన్లను శత్రుదుర్బేధ్యంగా నిర్మించాం. దేశంలో నక్సల్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య 2014 ఏడాదిలో 126 ఉంటే నేడు ఆ సంఖ్య 11కు దిగివచ్చింది. వచ్చే వార్షిక డీజీపీ/ఐజీపీల సదస్సులోపు దేశంలో నక్సలిజం పూర్తిగా అంతరించిపోతుంది’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు. 

ఈ నవంబర్‌ 30న ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా దేశాన్ని సురక్షితంగా ఉంచే లక్ష్యంతో చేపట్టిన ‘సురక్షిత్‌ భారత్‌’కు మార్గసూచీని సూచించడంతోపాటు డీజీపీ, ఐజీపీలకు మోదీ ఆరోజు దిశానిర్దేశంచేయనున్నారు.  ‘‘ వికసిత్‌ భారత్‌: భద్రతాంశాలు’’ ఇతివృత్తంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవ్యతిరేక చర్యలు, విపత్తు నిర్వహణ, మహిళా భద్రత, పోలీస్‌ విధుల్లో ఫోరెన్సిక్‌ శాస్త్రం, కృత్రిమమేథల విస్తృతస్థాయి వినయోగం అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)