Breaking News

‘అభివృద్ధిని ఇండియా కూటమి ఓర్వలేదు’: ప్రధాని మోదీ!

Published on Sun, 03/10/2024 - 13:24

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘అజంగఢ్‌లో గతంలో మాఫియా పాలన ఉండేదని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు చట్టబద్ధమైన పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ‘ఇండియా కూటమి’కి నిద్రపట్టడంలేదని ప్రధాని మోదీ విమర్శించారు. 

అజంగఢ్‌ అభివృద్ధికి బాటలు వేస్తుందని, నక్షత్రంలా వెలిగిపోతుందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నేతలు కేవలం పథకాలను మాత్రమే ప్రకటించేవారని విమర్శించారు. మోదీ  కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, దేశాభివృద్ధే లక్ష్యంగా తన ప్రయాణం సాతున్నదని అన్నారు. అజంగఢ్‌ అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కళ్లలో దుమ్ము కొట్టిందని ఆరోపించారు.  తాము దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మిస్తున్నామన్నారు. 

దేశం మొత్తం మీద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ నుండే ప్రారంభమవుతున్నాయని,  ఈరోజు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అజంగఢ్ నుంచి ప్రారంభించామన్నారు. నేడు ఆజంగఢ్‌ కొత్త చరిత్ర నాందిపలుకుతోందని అన్నారు. కులతత్వం, బంధుప్రీతి, ఓటు బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమి ఇంతటి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. అజంగఢ్, పూర్వాంచల్ ప్రజలకు రాజా సుహెల్‌దేవ్ స్టేట్ యూనివర్శిటీ, మండూరి విమానాశ్రయంతో సహా అనేక ప్రాజెక్టులను కానుకగా ఇచ్చారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)