Breaking News

ప్రాజెక్ట్‌ చీతా.. కొత్త పరేషాన్‌

Published on Wed, 06/28/2023 - 09:16

మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌కు సంబంధించిన ఒక వార్త కలకలం రేపుతోంది. కూనో అభయారణ్యంలో చీతాలను స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత.. ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 

తాజాగా ఈ అభయారణ్యంలోని పాల్పుర్‌ బీట్‌ సమీపంలో నమీబియా, సౌతాఫ్రికా చీతాల మధ్య పోరాటం జరిగింది. ఈ దాడులలో ‘అగ్ని’ అనే చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి కూనో పాల్పుర్‌ పశువైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది.

కూనో నేషనల్‌ పార్కులో సౌత్‌ ఆఫ్రికా,నమీబియాకు చెందిన చిరుతలు ఉన్నాయి. వీటిని ఈ అభయారణ్యంలో విడిచిపెట్టారు. వీటిని వేర్వేరు దిశలలో రిలీజ్‌ చేశారు. అయితే ఈ విశాల అరణ్యంలో ఉంటున్న ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి. 

‘అగ్ని’కి ప్రత్యేక వైద్యం..
తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలతో నమీబియాకు చెందిన ‘శౌర్య’, ‘గౌరవ్‌’లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్‌ ఆఫ్రికాకు చెందిన ‘అగ్ని’ తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ చిరుతను మానిటరింగ్‌ చేస్తున్న టీమ్‌ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన ‘అగ్ని’కి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.

ఆగని పోరాటాలు..
కూనో నేషనల్‌ పార్క్‌ డీఎఫ్‌ఓ ప్రకాశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ అభయారణ్యంలోని ‘అగ్ని’ అనే ఆడ చీతా గాయపడిందని, దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దాని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా నమీబియా నుంచి కూనో పార్కుకు తీసుకు వచ్చిన ‘శౌర్య’, ‘గౌరవ్‌’ చిరుతలు కవలలు. అవి భారత్‌కు వచ్చినప్పటి నుంచి కలివిడిగానే ఉంటున్నాయి. సౌత్‌ ఆఫ్రికా నుంచి తెచ్చిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలు వేర్వేరుగా మసలుతున్నాయి. ఇరుప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు..

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)