Breaking News

‘ఖతర్నాక్ కోడలు’.. చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే

Published on Wed, 06/12/2024 - 18:39

ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్‌గా పరిగణిస్తారు. తాజాగా, హిట్‌-అండ్‌-రన్‌ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  

పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్‌ సిటీలో అర్చనా మనీష్‌ పుట్టేవార్‌ టౌన్‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్‌ పేరున్న డాక్టర్‌. టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ  మామ పూరుషోత్తం పుట్టేవార్‌ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్‌ చేసింది.  

ఇందుకోసం అర్చన తన క్రిమినల్‌ మైండ్‌కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌‌లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్‌లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్‌-అండ్‌-రన్‌ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్‌,సచిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు.     

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)