Breaking News

రూ. 25 లక్షల చైనీస్‌ మాంజా స్వాధీనం.. బుల్డోజర్‌తో ధ్వంసం

Published on Tue, 01/14/2025 - 09:51

నేడు దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రీతుల్లో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో గంగా స్నానం, గాలిపటాలు ఎగురవేడం లాంటివి ఉన్నాయి. మరోవైపు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది.

మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా  చాలాచోట్ల గాలిపటాలను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.

మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో  భారీఎత్తున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉంది. గాలిపటాలు ఎగురవేసే వారు నైలాన్ దారం లేదా చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా ప్రాణహాని జరుగుతున్న నేపధ్యంలో నాగ్‌పూర్ పోలీసులు చైనీస్ థ్రెడ్‌ వినియోగం, విక్రయాలపై ఓ కన్నేసి ఉంచారు. లక్షల రూపాయల విలువైన చైనీస్‌ మంజాను స్వాధీనం చేసుకున్నారు.  డ్రోన్‌ల సాయంతో.. గాలిపటాలు ఎగురవేసేవారిపై నాగపూర్‌ పోలీసులు నిఘా సారించారు. అదేవిధంగా నగరంలోని ప్రతీవీధివీధినా తిరుగుతూ చైనీస్ దారాన్ని ఉపయోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజాగా నాగ్‌పూర్ పోలీసులు రూ.25 లక్షల విలువైన చైనీస్‌ దారాన్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు. ఇండోర్ మైదానంలో 2,599 బండిళ్లు కలిగిన దాదాపు రూ.25 లక్షల విలువైన నిషేధిత నైలాన్ మాంజాను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంత పౌరుల సమక్షంలో పోలీసులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. చైనామాంజా వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని నేరుగా కస్టడీకి పంపుతామని పోలీసులు హెచ్చరించారు. చైనీస్ థ్రెడ్ కారణంగా బైక్ రైడర్లు ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: పతంగుల​కు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి?

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)