Breaking News

Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురు కార్మికులు గాయాలు

Published on Thu, 09/04/2025 - 09:30

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తహసీల్‌ పరిధిలోని చందూర్ గ్రామంలో బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో  భారీ పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1:00 గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 900 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయని, మరో ఎనిమిదికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయాలపాలైనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు  చెబుతున్నారు. గాయపడిన ఒక కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ ‘రియాక్టర్ నుండి పొగలు రావడాన్ని చూసి, తామంతా బయటక వచ్చేశామన్నారు. 25 నిమిషాల  తర్వాత పేలుడు సంభవించిందని, పేలుడు కారణంగా ఎగిరిపడిన రాళ్ల కారణంగా దాదాపు 50 మంది గాయపడ్డారు’ అని తెలిపారు.
 

కాగా సోలార్ యూనిట్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారేమీ కాదని, గతంలో కూడా ఇలాంటి పేలుడు జరిగినట్లు  స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు. కాగా ఈ  పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)