లవర్స్‌ కోసం.. కుళాయిలు కొట్టేశారు

Published on Fri, 06/05/2026 - 11:42

ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్‌గా ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్‌ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.

ఇద్దరు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్‌లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్‌ను ఓ గోడౌన్‌ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్‌కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్‌గా మారింది.

ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27–28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్‌ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్‌పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం బయటపడింది 

గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్‌లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్స్‌ను కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్‌లీ స్కెచ్‌” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)