Breaking News

నాగాలాండ్‌ గవర్నర్‌ గణేశన్‌ కన్నుమూత

Published on Fri, 08/15/2025 - 21:20

చెన్నై:  నాగాలాండ్‌ గవర్నర, బీజేపీ మాజీ ఎంపీ ఎల్‌ గణేశన్‌(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ) సాయంత్రం చెన్నై  ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8వ తేదీన తలకు తగిలిన గాయంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కన్నుమూశారు. అప్పట్నుంచి స్పృహకోల్పోయిన గణేషన్‌.. తిరిగి కోలుకోలేదు. 

ఆయన అంత్యక్రియలు టీ నగర్‌లోని ఆయన ఇంటి వద్ద నిర్వహించనున్నారు. గణేశన్‌ భౌతికాయాన్ని రాజకీయ నాయకులు, బంధువులు సందర్శనార్థం రేపు(శనివారం, ఆగస్టు 16వ తేదీ)  ఆయన ఇంటివద్ద ఉంచనున్నారు.

1945, ఫిబ్రవరి 16వ తేదీన తంజావూర్‌లో ఆయన జన్మించారు. ఆయన యువకుడిగా ఉండగానే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన లా గణేషన్‌..  తండ్రి, అన్నల బాటలోనే నడిచారు. అలా 1970లో ఫుల్‌టైమ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఎంపికయ్యారు.

1991లో బీజేపీలో చేరిన ఆయన.. తమిళనాడు రాష్ట్ర యూనిట్‌కు ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా నియమించబడ్డారు. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆపై 10 ఏళ్ల తర్వాత గణేశన్‌ బీజేపీ జాతీయ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీకి జాతీయ స్థాయిలో వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన సేవలందించారు. 

2016లో మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 2021, ఆగస్టు 27వ తేదీన మణిపూర్‌ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న లా గణేశన్‌... 2023, ఫిబ్రవరి 19వ తేదీ వరకూ పని చేశారు. అదే సమయంలో జూలై 2022 నుంచి నవంబర్‌ వరకూ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్‌ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే గాయంతో ఆస్పత్రి పాలైన ఆయన...  2025, ఆగస్టు 15వ తేదీన మృతిచెందారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)