“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్‌

Published on Wed, 07/29/2026 - 12:27

నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై పార్లమెంట్‌లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలను సమర్థించారు. నిరసనలు చేపట్టినప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నిరసనకారులపై చర్యలు తీసుకున్న వారిపై ఎందుకు చర్యలు లేవని.. వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన నడ్డా.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం వారి బాధ్యత అని అన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

నిరసనలు చేస్తే చర్యలు సహజమే
విద్యార్థి ఉద్యమాలపై మాట్లాడిన నడ్డా.. యాక్టివిజంలో పాల్గొనేవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. చట్ట పరిమితులను దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్న నడ్డా.. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో తరగతి గది నుంచి రెండుసార్లు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.

‘నేనూ అరెస్టయ్యా..’
‘‘నేను కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను. ఎమర్జెన్సీ సమయంలో క్లాస్‌రూమ్‌ నుంచి రెండుసార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని నడ్డా పేర్కొన్నారు. అయితే అప్పటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యమాల్లో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందిస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్‌ చేశారు. అయితే నడ్డా మాత్రం పోలీసుల చర్యలను సమర్థించారు. చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)