Breaking News

బాంబు బెదిరింపులు.. ఇటు కోర్టు.. అటు రైల్వే స్టేషన్‌

Published on Tue, 01/06/2026 - 13:42

మైసూరు: బాంబు బెదిరింపులతో ఇటు ఒక కోర్టు ప్రాంగణంలో, మరోవైపు ఒక రైల్వే స్టేషన్‌ కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మైసూర్ జిల్లా కోర్టుకు మంగళవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

విషయం తెలుసుకున్న  పోలీసు అధికారులు వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు సంఘఘటనా స్థలానికి చేరుకున్నారు. కోర్టు ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల నియంత్రణలో ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో..
మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని మౌ (Mau) రైల్వే జంక్షన్‌లో కూడా బాంబు కలకలం చెలరేగింది. గోరఖ్‌పూర్ నుండి ముంబై వెళుతున్న కాశీ ఎక్స్‌ప్రెస్ (15018 డౌన్) రైలులో బాంబు అమర్చినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. ఈ వార్తతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు, జిఆర్‌పి (జీఆర్‌పీ), ఆర్‌పిఎఫ్ (ఆర్‌పీఎఫ్‌)బృందాలు సంయుక్తంగా రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అన్ని కోచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది నకిలీ బెదిరింపు అని అధికారులు భావిస్తున్నారు. అజ్ఞాతంగా కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇది  కూడా చదవండి: ‘నా నోబెల్‌ ట్రంప్‌కే..’ మచాడో సంచలనం

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)